మోడీని దేశమంతా తిప్పుతామంటున్న కమల'నాథు'డు
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన ఆయుధం నరేంద్ర మోడీ అన్న సంగతి తెలిసిందే. ఈ గుజరాత్ సీఎం ఛరిష్మాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో మోడీతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలోనూ మోడీ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇక భావి ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న జేడీ (యూ)తో ఈ విషయమై చర్చిస్తామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.